సూర్యత్రిశతి
ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.
పుడమి తల్లికి వెలుఁగు గముల నొసంగి
దాచి మున్నీటి నీటిని ధరణి కొసఁగి
తివిరి మ్రాకుల కెల్లను దిండి నొసఁగి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 1.
మానక పుడమి చుట్టు వేమారు దిరిగి
చూచి జీవుల వెచ్చని చూపు తోడ
వారిఁ బురికొల్పి నిత్యము పాటుపడఁగ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 2.
సమయ మది యెల్లరకుఁ బంచి సమము గాను
బనులు నూఱట లింపుగఁ బరఁగు పగిది
మీఱి రేయి పవళు లన వేఱు పఱచి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 3.
వెలుఁగు లీని విద్యుచ్ఛక్తి విరియఁ జేసి
విశ్వ మెల్ల నింపి భృశమ్ము శాశ్వతముగఁ
గలిమి నెగడంగ జనులకుఁ గరుణ తోడ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 4.
అణు వణువున నున్న మురారి నరయ లేము
కలఁడు లేఁ డను శంకయుఁ గలదు జగతిఁ
గన్నుల కగపడుదు వయ్య కాలచక్ర
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 5.
తామరస షండ రంజక తను విలాస
చంద్ర మండల దీపక చారు కిరణ
తిమిర పరిపూర్ణ నాశక దివ్య పురుష
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 6
దేవ వర్త్మసంచారక దీప రత్న
భస్మతూల విద్రావణ భానుమంత
రాఘ వోదక గ్రాహక రశ్మిమంత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 7
ఏక చక్ర రథ గమన లోకసాక్షి
సప్త ఘోటక స్యందన దీప్త కిరణ
చండ కిరణ సహస్ర ప్రచండ తేజ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 8
పాలకశ్రేష్ఠ రఘువంశ మూల పురుష
ప్రాగ్దిశా సతీ ఫాల ప్రభా విశేష
గగన వనితా శిరస్స్థి తాంగారక మణి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 9
రామచంద్ర సంకీర్తిత సోమబంధు
వాయుజాత విద్యాప్రద పద్మమిత్ర
ధర్మనందన వందిత కర్మసాక్షి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 10
సిత నభో మండలస్థిత చిద్విలాస
చంద్ర తారక సంప్రీత చారుమూర్తి
లోక రక్షైక రత చిత్త లోకనాథ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 11
హరి సువర్ణాశ్వ రథ ధామ హర్తృ నామ
హరి వరాఖ్య సంభావిత హర్ము టాఖ్య
కర సహస్ర సద్విలసిత కాంతిమంత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 12
స్థిర విహార ప్రభాకర దివ్యతేజ
పురహ రాప్తమిత్ర సవితృ పూర్ణబింబ
ఖర కర జ్వలిత తిమిర కాశ్యపేయ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 13
ద్విజ వ రానూర బాహు చోదిత రథి వర
ద్విజ ముని గణ సంసేవన తృప్త మిహిర
ద్విజ విభూషణ హృన్మణి స్థిత దినకర
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 14
కాంతి పుంజ దిగ్దీపక కాలచక్ర
స్వంతరంగ సంపూరిత హాయన చయ
సంత తాంశు విరాజిత స్వర్ణరేత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 15
దాచి మున్నీటి నీటిని ధరణి కొసఁగి
తివిరి మ్రాకుల కెల్లను దిండి నొసఁగి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 1.
మానక పుడమి చుట్టు వేమారు దిరిగి
చూచి జీవుల వెచ్చని చూపు తోడ
వారిఁ బురికొల్పి నిత్యము పాటుపడఁగ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 2.
సమయ మది యెల్లరకుఁ బంచి సమము గాను
బనులు నూఱట లింపుగఁ బరఁగు పగిది
మీఱి రేయి పవళు లన వేఱు పఱచి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 3.
వెలుఁగు లీని విద్యుచ్ఛక్తి విరియఁ జేసి
విశ్వ మెల్ల నింపి భృశమ్ము శాశ్వతముగఁ
గలిమి నెగడంగ జనులకుఁ గరుణ తోడ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 4.
అణు వణువున నున్న మురారి నరయ లేము
కలఁడు లేఁ డను శంకయుఁ గలదు జగతిఁ
గన్నుల కగపడుదు వయ్య కాలచక్ర
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 5.
తామరస షండ రంజక తను విలాస
చంద్ర మండల దీపక చారు కిరణ
తిమిర పరిపూర్ణ నాశక దివ్య పురుష
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 6
దేవ వర్త్మసంచారక దీప రత్న
భస్మతూల విద్రావణ భానుమంత
రాఘ వోదక గ్రాహక రశ్మిమంత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 7
ఏక చక్ర రథ గమన లోకసాక్షి
సప్త ఘోటక స్యందన దీప్త కిరణ
చండ కిరణ సహస్ర ప్రచండ తేజ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 8
పాలకశ్రేష్ఠ రఘువంశ మూల పురుష
ప్రాగ్దిశా సతీ ఫాల ప్రభా విశేష
గగన వనితా శిరస్స్థి తాంగారక మణి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 9
రామచంద్ర సంకీర్తిత సోమబంధు
వాయుజాత విద్యాప్రద పద్మమిత్ర
ధర్మనందన వందిత కర్మసాక్షి
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 10
సిత నభో మండలస్థిత చిద్విలాస
చంద్ర తారక సంప్రీత చారుమూర్తి
లోక రక్షైక రత చిత్త లోకనాథ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 11
హరి సువర్ణాశ్వ రథ ధామ హర్తృ నామ
హరి వరాఖ్య సంభావిత హర్ము టాఖ్య
కర సహస్ర సద్విలసిత కాంతిమంత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 12
స్థిర విహార ప్రభాకర దివ్యతేజ
పురహ రాప్తమిత్ర సవితృ పూర్ణబింబ
ఖర కర జ్వలిత తిమిర కాశ్యపేయ
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 13
ద్విజ వ రానూర బాహు చోదిత రథి వర
ద్విజ ముని గణ సంసేవన తృప్త మిహిర
ద్విజ విభూషణ హృన్మణి స్థిత దినకర
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 14
కాంతి పుంజ దిగ్దీపక కాలచక్ర
స్వంతరంగ సంపూరిత హాయన చయ
సంత తాంశు విరాజిత స్వర్ణరేత
శుభము లొసఁగుమా మమ్మేలు సూర్య దేవ 15